News February 25, 2025
ఏలూరు: మసాజ్ సెంటర్ కేసులో నిందితుడు అరెస్ట్

ఏలూరులో మసాజ్ సెంటర్ల పేరిట వ్యభిచారం నిర్వహించిన ఘటన ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు భాను ప్రసాద్ పోలీసులకు చిక్కాడు. సోమవారం సాయంత్రం అతణ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఏలూరు సబ్ జైలుకు తరలించారు.
Similar News
News February 25, 2025
NTR : MLC ఎన్నికలు.. పరీక్షలు వాయిదా

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు ఈ నెల 27న ఉన్నందున ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశామని కృష్ణా యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో 27న జరగాల్సిన ఎంటెక్ ఒకటో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలను మార్చి 3వ తేదికి వాయిదా వేశామని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
News February 25, 2025
3 ఓవర్లలోనే సెంచరీ.. మీకు తెలుసా?

ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డును సృష్టించారని మీకు తెలుసా? 1931లో జరిగిన ఓ దేశవాళీ మ్యాచ్‌లో 3 ఓవర్లలోనే సెంచరీ చేశారు. ఆ సమయంలో ఓవర్‌కు 8 బంతులు ఉండేవి. తొలి ఓవర్‌లో 33, రెండో దాంట్లో 40, మూడో ఓవర్లో 27 పరుగులు చేసి సెంచరీ బాదారు. ప్రస్తుతం ఓవర్‌కు 6 బంతులే ఉండటంతో 3 ఓవర్లలో సెంచరీ చేయడం అసాధ్యమే.
*ఇవాళ బ్రాడ్‌మన్ వర్ధంతి
News February 25, 2025
ఫేక్ ఉద్యోగ ప్రకటనలపై జాగ్రత్త: ఎస్పీ

ఫేక్ ఉద్యోగ ప్రకటనలు, లాటరీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అపరిచిత లింక్‌లు, ఈమెయిల్‌లపై క్లిక్ చేయవద్దన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎక్కువగా షేర్ చేయవద్దన్నారు.