News June 15, 2024

ఏలూరు: మసీదుల వద్ద కట్టదిట్టమైన బందోబస్తు: SP

image

ఏలూరు ఈ నెల 17వ తేదీన బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఎస్పీ మేరీ ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. మతపెద్దలతో సమావేశమై మత సామరస్యాన్ని కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. పోలీసు అధికారులు ముస్లిం పెద్దలతో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News November 17, 2024

ప.గో : బాలికపై అత్యాచారం

image

చాగల్లుకు చెందిన బాలిక(14)పై వరుసకు మేనమామ అయే కమల్(22) అత్యాచారం చేశాడు. పోలీసుల కథనం..బాలిక సమిశ్రగూడెం ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లో చదువుకుంటోంది. ఆధార్‌లో మార్పులు చేయడానికి తాడేపల్లిగూడెం వాసి కమల్‌ను బాలిక అమ్మమ్మ పంపింది. అతను తీసుకొచ్చి అత్యాచారం చేసి వాళ్ల ఇంట్లో అప్పగించాడు. బాలిక ఇంట్లో విషయం చెప్పగా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News November 17, 2024

నరసాపురం: సబ్ జైల్ తనిఖీ చేసిన జడ్జీ వరలక్ష్మి

image

జైల్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా టౌన్ లోని సబ్ జైల్‌ను ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఆర్. వరలక్ష్మి శనివారం పర్యవేక్షించి నిందితుల కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలు తదితర విషయాలను ముద్దాయిలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సలహాదారులు జైల్ ముద్దాయిలకు అందించే న్యాయ సహాయంపై న్యాయమూర్తి ఆరా తీశారు.

News November 16, 2024

అసెంబ్లీలో RRRతో విశాఖ ఎమ్మెల్యే వాగ్వాదం

image

ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ RRR, విశాఖ MLAకి మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతుండగా టైం అయిపోందని RRR బెల్ కొట్టారు. ‘మీరు అప్పుడే బెల్ కొడితే ఎలా అధ్యక్షా. గంట పర్మిషన్ తీసుకున్నా’ అని MLA చెప్పగా.. ‘అందరికీ కలిపి ఒక గంట సమయం ఇచ్చారు. మీకు ఒక్కరికే కాదు. ఇంకా 25 మంది మాట్లాడాలి. త్వరగా ముగించండి’ అంటూ మరికాస్త సమయం ఇచ్చారు.