News March 10, 2025
ఏలూరు: లవ్ ఫెయిల్.. యువకుడి సూసైడ్?

విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామానికి చెందిన వంశీ(25) విజయవాడలోని ఓ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఓ యువతి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి గిరిపురంలో రూము తీసుకుని ఉంటున్నారు. ఇటీవల ఆ యువతి రూము నుంచి వెళ్లిపోయింది. బాధతో వంశీ ఈనెల 6వ తేదీ విషం తాగాడు. ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతిచెందాడు.
Similar News
News March 10, 2025
ఈనెల 20లోపు అన్ని పోటీ పరీక్షల రిజల్ట్స్: TGPSC

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షించకుండా టీజీపీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈనెల 20లోపు అన్ని పోటీ పరీక్షల రిజల్ట్స్ వెల్లడిస్తామని ప్రకటించింది. తాజాగా గ్రూప్-1 ఫలితాలు వెల్లడించింది. రేపు గ్రూప్-2, ఈనెల 14న గ్రూప్-3, ఈనెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈనెల 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది.
News March 10, 2025
ఓటముల బాధ్యుడు గౌతీ CT విజయానికి అవ్వరా..!

ట్రాన్సిషన్ పీరియడ్లో కోచింగ్ అంత ఈజీ కాదు. Sr వెళ్లిపోయే, Jr తమ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంటున్న వేళ జట్టుకూర్పు సంక్లిష్టంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో, ఏ ప్లేసులో, ఎవరెలా ఆడతారో తెలియాలంటే ప్రయోగాలు తప్పనిసరి. ప్రతి ప్రయోగం సక్సెస్ అవుతుందన్న రూలేం లేదు. ఇది అర్థం చేసుకోలేకే శ్రీలంక, కివీస్ చేతుల్లో ఓడగానే వేళ్లన్నీ గౌతీవైపే చూపాయి. మరిప్పుడు CT విజయ కీర్తి అతడికి దక్కినట్టేనా! విమర్శలు ఆగేనా!
News March 10, 2025
అంతర్జాతీయ సహకార సంవత్సరంగా 2025: కలెక్టర్

2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార ఏడాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సోమవారం అన్నారు. సహకార సంఘాల ద్వారా బహుళార్థక సేవా కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను నిలువ చేసుకునే సదుపాయం కల్పించాలన్నారు. యువతను సహకార సంఘాలలోకి తీసుకొని రావాలన్నారు. కంప్యూటరీకరణ పూర్తిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సూచించారు.