News March 20, 2025

ఏలూరు: విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి 

image

ఏలూరు జిల్లాలో గడిచిన 30 రోజుల్లో 57,481 ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ జరిగిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 ఏళ్లలోపు, 15-17 ఏళ్లు ఉన్న విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఆధార్ అప్డేట్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకులు దూరమవుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ఉన్నారు.

Similar News

News March 28, 2025

బాపట్ల: ‘పొగాకు రైతులకి న్యాయం చేయాలి’ 

image

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పొగా రైతులు, వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పలువురు రైతులు ప్రజా పరిష్కార వేదిక వద్ద బర్లీ పొగాకు రైతులకి న్యాయం చేయాలని, పంటను కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు.

News March 28, 2025

 హెలీప్యాడ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: బాపట్ల కలెక్టర్

image

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను శుక్రవారం ఆదేశించారు. శనివారం సాయంత్రంలోగా ముఖ్యమంత్రి హెలిప్యాడ్ పనులను పూర్తి చేయాలని ఆర్& బీ ఇంజనీర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభా వేదిక వద్ద బ్యారికేడ్లలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ప్రజా వేదికను సౌకర్యవంతంగా తయారు చేయాలన్నారు

News March 28, 2025

కృష్ణా: డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకోండి- కలెక్టర్

image

యువత డ్రగ్స్ బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆయన నార్కోటిక్ కో-ఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు హాజరై డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు.

error: Content is protected !!