News March 20, 2025
ఏలూరు: వైసీపీకి కార్పొరేటర్ రాజీనామా

ఏలూరు 7వ డివిజన్ కార్పొరేటర్ పిల్లంగోళ్ల శ్రీదేవి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత జగన్‌కు పంపినట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల తన సోదరి, రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మిని ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త అవమానించారని అన్నారు. ఆమెపై అసత్య ప్రచారాలు చేసి సస్పెండ్ చేయడం తనను ఎంతో బాధించిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News March 21, 2025
బ్యాడ్మింటన్‌లో సంచలనం

బ్యాడ్మింటన్ టోర్నీ స్విస్ ఓపెన్ 2025లో భారత షట్లర్ శంకర్ ముత్తుస్వామి సంచలనం నమోదు చేశారు. వరల్డ్ నం.2 ర్యాంకర్ అండర్స్ ఆంటోన్సన్‌పై విజయం సాధించారు. 18-21, 21-12, 21-5 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.
News March 21, 2025
ALERT.. మూడు రోజులు వర్షాలు

ద్రోణి ప్రభావంతో TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, MNCL, ఉమ్మడి కరీంనగర్, BHPLతో పాటు మరికొన్ని చోట్ల మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, YSR, నంద్యాల, ప్రకాశం, పల్నాడులో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.
News March 21, 2025
VKB: టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

నేటి నుంచి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 12,903 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు తెలిపారు. >SHARE IT