News March 15, 2025
ఏలూరు: శనివారం నుంచి ఒంటిపూట బడులు

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఒంటి పూట బడులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి మహాలక్ష్మమ్మ తెలిపారు. ఈ ఆదేశాలను డివైఈవోలు, ఎంఈవోలు అన్ని పాఠశాలల్లో పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు.
Similar News
News March 15, 2025
విశాఖ జూలో వరుస మరణాలు..!

విశాఖ జూపార్క్‌లో వన్యప్రాణుల వరుస మరణాలు జంతు ప్రేమికులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే గతంలో అరుదైన జత జిరాఫీలు, ఒక జీబ్రా, నీటి ఏనుగు మృత్యువాత పడ్డాయి. తాజాగా కొన్ని రోజుల క్రితం ఆసియాటిక్ లయన్‌కు పుట్టిన రెండు సింహపు కూనలు ప్రాణాలు విడిచాయి. గురువారం అనారోగ్యంతో 20 ఏళ్ల చిరుత పులి ప్రాణాలు విడిచింది. ప్రభుత్వం,అధికారులు దృష్టి పెట్టి వన్యప్రాణులను కాపాడాలని సందర్శకులు కోరుతున్నారు.
News March 15, 2025
నా చివరి రక్తపు బొట్టువరకూ ప్రజలకు సేవ చేస్తాను: సీఎం చంద్రబాబు

AP: తన జీవితం ప్రజల కోసం అంకితమని తణుకు పర్యటనలో CM చంద్రబాబు తెలిపారు. ‘41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. నా జీవితమంతా అలుపెరుగని పోరాటమే. నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేయాలనేదే నా సంకల్పం. ఇప్పటి వరకు చేసినదానికి రెట్టింపు పనిని వచ్చే 5, 10 ఏళ్లలో చేస్తాను. వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా చేస్తాను’ అని వ్యాఖ్యానించారు.
News March 15, 2025
NZB: ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోంది: కవిత

అసెంబ్లీలో మా సభ్యులను సస్పెండ్ చేయడం.. మండలిలో మా మీద ఆన్ పార్లమెంటరి వర్డ్స్ వాడటం చుస్తే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతోందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మండలి మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. శాసనమండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కక్ష సాధిస్తున్నారన్నారు.