News March 16, 2025
ఏలూరులో రేపటి నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

ఏలూరు జిల్లాలో శనివారంతో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. సంబంధిత ఆన్షర్ షీట్లను సోమవారం నుంచి దిద్దనున్నారు. ఏలూరు కోటదిబ్బ జూనియర్ కళాశాలలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందని రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కె.యోహాను తెలిపారు. ఇంగ్లిషు, తెలుగు, లెక్కలు, హిందీ, సివిక్స్ సబ్జెక్టులకు ఎంపిక చేసిన అధ్యాపకులు ఉదయం 10 గంటలకు వాల్యుయేషన్ సెంటర్ వద్దకు రావాలని ఆయన ఆదేశించారు.
Similar News
News March 16, 2025
రూమ్‌లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా?: కోహ్లీ

ఆటగాళ్లు పర్యటనలో ఉన్నప్పుడు వెంట కుటుంబాలను తీసుకెళ్లకూడదని BCCI విధించిన తాజా నిబంధనపై విరాట్ కోహ్లీ స్పందించారు. ‘మ్యాచుల్లో ఎంతో తీవ్రతతో ఆడుతుంటాం. మ్యాచ్ పూర్తికాగానే కుటుంబం చెంతకు చేరడం ఎంతో రిలీఫ్ ఇస్తుంటుంది. అది ఆటగాళ్లకు చాలా అవసరం. అంతేకానీ మ్యాచ్ ముగిశాక రూమ్‌లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా? కుటుంబాలు మాతో ఉండటం ఎంత అవసరమో కొంతమందికి తెలియట్లేదు’ అని పేర్కొన్నారు.
News March 16, 2025
ఉండవల్లి: హడ్కో- సీఆర్డీఏ మధ్య ఒప్పందం

ఉండవల్లి నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో-సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్లు రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
News March 16, 2025
సాగు, తాగు నీటికి ఆటంకాల్లేని నిరంతర విద్యుత్: మంత్రి

బత్తలపల్లె మండలం అప్పరాచెరువులో రూ.1.62 కోట్లతో అప్ గ్రేడ్ చేసిన 11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా అప్పరాచెరువు, చెన్నపట్నం, జ్వాలాపురం గ్రామాలకు త్రీ ఫేజ్ నిరంతర విద్యుత్ అందుబాటులో ఉంటుందన్నారు. సాగు, తాగు నీటికి ఆటంకాల్లేని విద్యుత్ అందుతుందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యలు తీర్చాలని అధికారులకు సూచించారు.