News March 2, 2025

ఏలూరులో వ్యాపారి ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో జరిగింది. పట్టణంలోని ఫత్తేబాదకు చెందిన విద్యాసాగర్(38) స్థానికంగా ఒక ఫ్యాన్సీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలు వైజాగ్‌లోని పుట్టింటికి వెళ్లారు. ఈ సమయంలో శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యాపారం కోసం అప్పులపాలు కావడమే ఆత్మహత్యకు కారణంగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 18, 2025

మీ ఊరిలో ఎవరు గెలిచారు?.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!

image

TG: పంచాయతీ ఎన్నికల తుది పోలింగ్ ముగియడంతో ఎక్కడ చూసినా కొత్త సర్పంచ్‌ల గురించే చర్చ. ప్రలోభాలను చూసి ఓటేశారా? అభివృద్ధి చేస్తారని నమ్మారా? అని ఒకరిని ఒకరు ఆరా తీస్తున్నారు. భారీగా డబ్బు పంచి గెలిచారని చాలచోట్ల జనం మాట్లాడుకుంటున్నారు. కుల సమీకరణాలు, నోట్ల కట్టల ప్రభావం గెలుపోటములను శాసించాయనే ఆరోపణలు వస్తున్నాయి. మీ ఊరి కొత్త సర్పంచ్ ఎవరు? ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచారో కామెంట్ చేయండి.

News December 18, 2025

కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారిగా ప్రసన్న వెంకటేశ్

image

కలెక్టర్ల రెండో రోజు సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. కాకినాడ జిల్లా బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్‌కు అప్పగించింది. జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా అమలు చేయడం లక్ష్యంగా ఆయన విధులు నిర్వహించనున్నారు.

News December 18, 2025

సౌత్‌లో పొల్యూషన్‌ లేదు.. అక్కడ మ్యాచ్‌లు ఆడొచ్చు: శశిథరూర్

image

తీవ్ర పొగమంచు కారణంగా ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దక్షిణాదిలో మ్యాచ్‌లు ఆడొచ్చు. ఎందుకంటే అక్కడ కాలుష్యం, విజిబిలిటీ సమస్య లేదు. అభిమానులు కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఉత్తర భారతంలో మ్యాచ్‌లను ఎందుకు షెడ్యూల్ చేయాలి? బదులుగా సౌత్‌లో నిర్వహించాలి’ అని సూచించారు.