News February 24, 2025

ఏసీబీకి చిక్కిన అన్నమయ్య జిల్లా అధికారి 

image

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో జౌళి శాఖ అధికారి కృష్ణయ్య పడ్డాడు. అన్నమయ్య జిల్లా, రాయచోటిలో చేనేత జౌళి శాఖ జిల్లా అధికారి కృష్ణయ్య సోమవారం లబ్ధిదారుల నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ విజయ కుమారి ఆదేశాలతో కడప ఏసీబీ డీఎస్పీ జెస్సి ప్రశాంతి, సీఐలు జిల్లా జౌళి శాఖ అధికారి కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలను వెల్లడిస్తామని అడిషనల్ ఎస్పీ విజయకుమారి తెలిపారు.

Similar News

News February 25, 2025

సజావుగా ఎన్నికలు నిర్వహించండి: కలెక్టర్

image

ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఎన్నికల సిబ్బందికి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో పిఒ, ఎపిఓ, ఓపిఓ, రూట్, సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ సరళి మాత్రమే చూసుకుంటే సరిపోదని, అనవసర వ్యక్తులను పోలింగ్ స్టేషన్ పరిధిలోకి రాకుండా, వారిని నియంత్రించే బాధ్యత కూడా చేపట్టాలని ఆదేశించారు.

News February 25, 2025

ఎటు వైపు తిరిగి నిద్రపోతే మంచిది?

image

ఏ వయసు వారైనా నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయని, ఆయాసం నుంచి ఉపశమనం కలిగి శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుందని పేర్కొంటున్నారు. శారీరక నొప్పులు రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు కుడి వైపు, వెల్లకిలా పడుకోవాలని సూచిస్తున్నారు.

News February 25, 2025

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* కృష్ణ: 48 గంటలు మద్యం దుకాణాల బంద్ * కంకిపాడులో దారి దోపిడీ ముఠా అరెస్ట్ * కృష్ణా: ధ్రువీకరించని యాప్‌స్‌తో జాగ్రత్త: SP * బాపులపాడు: యువకుల మృతికి కారణమిదే * విజయవాడ: వ్యభిచార గృహంపై పోలీసులు దాడి * కృష్ణా: PDF అభ్యర్థికి జగన్ మద్దతు * శివరాత్రికి సిద్ధమవుతున్న యనమలకుదురు * గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో ముగ్గురి అరెస్ట్

error: Content is protected !!