News January 28, 2025
ఐటీసీ ఎన్నికల్లో అనైతిక పొత్తులు

సారపాక ఐటీసీ కర్మాగారంలో ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. TDP, YSRCP అనుబంధ సంస్థలు పొత్తుతో ముందుకెళ్తున్నాయి. నిన్న ఇరుపార్టీల నేతలు కలిసి ర్యాలీ నిర్వహించడం గమనార్హం. అసలు ఇరుపార్టీలు పొత్తు ఉన్న సందర్భాలు ఎక్కడా లేవు. మరోవైపు ఈ అనైతిక పొత్తులు ఎవరి స్వలాభం కోసం? అనే చర్చ కూడా మొదలైంది.
Similar News
News March 14, 2025
నా కెరీర్ ముగిసిందని అనుకున్నారు.. కానీ: విజయ్ సేతుపతి

తన కెరీర్ ముగిసిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో ‘మహారాజ’ సినిమా తనను నిలబెట్టిందని విజయ్ సేతుపతి తెలిపారు. ఓ అవార్డు కార్యకమంలో మాట్లాడుతూ ‘2-3 ఏళ్లు నా సినిమాలు బాగా ఆడలేదు. ఆ సమయంలో ‘మహారాజ’ వచ్చి నన్ను నిజంగానే ‘మహారాజ’ను చేసింది. దీనికి ఇంతలా ప్రశంసలు వస్తాయని ఊహించలేదు’ అని పేర్కొన్నారు. 2024లో రిలీజైన ఈ సినిమా చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియా సినిమాగా నిలిచింది.
News March 14, 2025
కొత్తకోట: స్కూటీలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కొత్తకోట పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ముమ్మళ్ళపల్లి గ్రామానికి చెందిన శేషన్న, సుధాకర్‌లు స్కూటీపై కొత్తకోటకు వచ్చి పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా స్కూటీలో మంటలు వస్తున్నట్లు గమనించి వెంటనే ఆపి పక్కకు జరిగారు. సమీపంలో ఫైర్ స్టేషన్ ఉండడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
News March 14, 2025
అంబేడ్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది: హరీష్ రావు

బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ లో దుయ్యబట్టారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని దళితుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కూడా కాంగ్రెస్ అవమానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందని ధ్వజమెత్తారు.