News December 10, 2024

ఐదున్నర దశాబ్దాలకు ఆత్మీయ సమ్మేళనం

image

పటాన్‌చెరులో 1971-72లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 55ఏళ్లకు ఆత్మీయ అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. మాజీ కార్పొరేటర్ సపాన్ దేవ్ ఆధ్వర్యంలో పూర్వ స్నేహితులు (విద్యార్థులు) కలుసుకొని ఒకరినొకరు పలకరించుకొని ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నట్లు వివరించారు.

Similar News

News December 27, 2024

సంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం.. 20ఏళ్లు జైలు

image

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రజినీకాంత్‌కు 20 ఏళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి జయంతి తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. 2019లో చౌటకూరు మండలం ఉప్పరగూడెంకు చెందిన రజనీకాంత్ ఇంటికి వెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తండ్రి పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు.

News December 27, 2024

సిద్దిపేట: స్పూర్తి ప్రధాత మన్మోహన్ సింగ్: మంత్రి పొన్నం

image

స్పూర్తి ప్రధాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మన్మోహన్ సింగ్ వివేకం, సమగ్రతకు ఆదర్శమని, ఆయన దార్శనిక నాయకత్వం.. భారతదేశ పురోగతి పట్ల తిరుగులేని నిబద్ధత, దేశంపై చెరగని ముద్ర వేసిందన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు.

News December 26, 2024

మాజీ ఎంపీ మందా జ‌గ‌న్నాథంను ప‌రామ‌ర్శించిన హ‌రీశ్‌రావు

image

నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగ‌ర్‌క‌ర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు హ‌రీశ్‌రావు. అనంత‌రం జ‌గ‌న్నాథం ఆరోగ్య ప‌రిస్థితి వివ‌రాల‌ను వైద్యుల‌ను అడిగి హ‌రీశ్‌రావు తెలుసుకున్నారు.