News April 8, 2024

ఐనవోలు: కొత్త కళ సంతరించుకున్న మల్లన్న ఆలయం

image

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని మల్లికార్జునస్వామి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. ఇటీవల ఓ దాత రూ.13 లక్షలతో ఇత్తడి తొడుగు, బంగారుపూతతో గర్భాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఆలయం కొత్త రూపును సంతరించుకుంటూ, భక్తులను ఆకర్షిస్తున్నది. దాతల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవస్థానం ఈవో అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు.

Similar News

News December 28, 2024

ముందస్తు చర్యలతో నేరాలు అదుపు: వరంగల్ సీపీ

image

నేరాల నియంత్రణలో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకుంటున్న ముందస్తు చర్యలతో నేరాలు తగ్గాయని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. నేరాలకు సంబంధించి నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయడంతో పాటు కోర్టుకు తగిన సాక్షాధారాలు సమర్పించడంతో కమిషనరేట్ పరిధిలో దాదాపు 2,462 మందికి శిక్షలు విధించినట్లు సీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అధికారులు పాల్గొన్నారు. 

News December 28, 2024

వరంగల్‌కు నాస్కామ్ శుభవార్త!

image

వరంగల్‌‌కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(NASSCOM) శుభవార్త చెప్పింది. HYD తర్వాత వరంగల్ నగరం గ్లోబల్ కేపబిలీటీ సెంటర్ల(జీసీసీ)కు డెస్టినేషన్‌లుగా మారనున్నాయని తెలిపింది. జిల్లాలో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రాజధానికి దగ్గర్లో ఉండటం, అక్కడితో పోలిస్తే భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

News December 28, 2024

మన్మోహన్ పార్థివదేహానికి ఎంపీ వద్దిరాజు నివాళి

image

ప్రధాన మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన పార్థివదేహానికి కేటీఆర్‌, వద్దిరాజు రవిచంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల ప్రముఖుడిగా పేరుగాంచిన ఆయన మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.