News February 1, 2025

ఐర్లాండ్‌లో రొంపిచర్ల వాసి మృతి

image

రొంపిచర్ల గ్రామానికి చెందిన చెరుకూరి సురేష్ (26) ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు శుక్రవారం తెలిపారు. సురేష్ ఐర్లాండ్లో ఎమ్మెస్ చదవడానికి సంవత్సరం క్రితం వెళ్ళాడు. స్నేహితులతో కలిసి కారులో ముగ్గురితో వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సురేష్‌తో పాటు విజయవాడ సమీపంలోని జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన మరొకరు మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News February 1, 2025

శ్రీకాకుళం: హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

image

శ్రీకాకుళం మహిళా కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహం-3 వార్డెన్ ఎం.పూర్ణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి హాస్టల్ విద్యార్థినిపై జరిగిన దాడి నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ విద్యార్థినిపై వ్యక్తులు దాడి చేసిన విషయం సంచలనం కావడంతో యుద్ధప్రాతిపదికన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

News February 1, 2025

కేక్ కొనేందుకు వెళుతూ ముగ్గురు స్పాట్ డెడ్ 

image

గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కొర్నేపాడు గ్రామానికి చెందిన స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు స్నేహితులు ఒకే బైక్‌పై కేక్ కొనుగోలు చేసేందుకు వెళుతూ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని మరణించారు. ఈ ప్రమాదంతో ముగ్గురు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానిక పోలీసులు తెలిపారు. 

News February 1, 2025

MBNR: తమ్ముడిని దించొద్దామని వెళ్లి.. చనిపోయాడు

image

MBNR జిల్లా మన్యంకొండ సమీపంలో నిన్న జరిగిన <<15324831>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మండలంలోని పోతన్‌పల్లికి చెందిన ఆంజనేయులు(21) తమ్ముడు కేశవులు(19) గుంటూర్‌లో చదువుకుంటున్నాడు. సెలవులపై వచ్చిన కేశవులును గుంటూర్‌కు పంపేందుకు శుక్రవారం తెల్లవారుజామున బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంజనేయులు మృతి చెందాడు. కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.