News May 17, 2024

ఐసెట్’కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

image

రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2024’కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 75,520 దరఖాస్తులు రాగా, ఈసారి ఇప్పటివరకు 80,723 వచ్చినట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య శ్రీరామోజు నరసింహాచారి తెలిపారు. ఈ నెల 17 వరకు రూ.250 రుసుముతో దరఖాస్తుకు అవకాశం ఉండగా, రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 27 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

Similar News

News October 3, 2024

వరంగల్: నేడు ఎస్జీటీ అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన

image

వరంగల్ జిల్లా ఎస్జీటీ 1:3 నిష్పత్తిలో భాగంగా గురువారం 271 నుంచి 435 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. నిన్న సర్టిఫికెట్ పరిశీలనకు రాని అభ్యర్థులు.. ఈరోజు కూడా అటెండ్ అవ్వవచ్చన్నారు. అభ్యర్థులు వచ్చే ముందు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత గెజిటెడ్ సంతకంతో సర్టిఫికెట్లన్నీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అన్నారు.

News October 3, 2024

ములుగు: పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి

image

పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. శంకరాజుపల్లి గ్రామానికి చెందిన సుమన్, మానస దంపతుల కుమారుడు గగన్(3) చిన్నబోయినపల్లిలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాము కాటు వేసింది. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం తరలించగా పరిస్థితి విషమించి నేడు మృతి చెందాడు.

News October 3, 2024

జనసంద్రమైన వేయి స్తంభాల ఆలయ పరిసర ప్రాంతాలు

image

HNK జిల్లా కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల సందర్భంగా వేయి స్తంభాల ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. హనుమకొండ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు.