News March 6, 2025
ఒంగోలు: 30 మండలాలకు అధ్యక్షుల ప్రకటన

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని 30 మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు షేక్. సైదా ప్రకటించారు. ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేయాలని అన్నారు. షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవడానికి సమష్టిగా కృషి చేస్తామని అన్నారు.
Similar News
News March 6, 2025
అధికారులకు కీలక సూచనలు చేసిన ప్రకాశం కలెక్టర్

ఈనెల 8వ సీఎం చంద్రబాబు మార్కాపురం పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ తమిమ్ ఆన్సరియా కీలక సూచనలు చేశారు. కేటాయించిన విధులను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లు, వీఐపీ, జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
News March 6, 2025
ఒంగోలు: పిల్లలు చెప్పిన మాట వినలేదని తల్లి సూసైడ్

ఒంగోలు నగరం ధారావారితోటలో వివాహిత కె.లక్ష్మీభవానీ(34) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలతోపాటు పిల్లలు కూడా చెప్పిన మాట వినడంలేదంటూ క్షణికావేశంలో ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుంది.ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు ఆమెను రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మీభవాని మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ నాగరాజు చెప్పారు.
News March 6, 2025
లోకేశ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తాటిపర్తి ట్వీట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే తక్కువ మెజారిటీ సాధించిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత లేదన్న మంత్రి లోకేశ్ వ్యాఖ్యలపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. అలా అయితే జగన్ మోహన్ రెడ్డి కంటే తక్కువ మెజారిటీ వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా జగన్‌ను విమర్శించే అర్హత లేనట్టే కదా అన్నారు.