News January 21, 2025
ఒంగోలు: ‘కలెక్టరమ్మా.. కొడుకులు అన్నం పెట్టడం లేదు’
‘తల్లీ కలెక్టరమ్మా నాకు మీరే దిక్కు’ అంటూ కలెక్టర్ తమిమ్ అన్సారియాను సోమవారం ఓ వృద్ధురాలు కలెక్టర్ కార్యాలయంలో వేడుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద టంగుటూరు మండలం నిడమానూరుకి చెందిన తంపనేని సౌభాగ్యమ్మ అనే వృద్ధురాలు జిల్లా కలెక్టర్‌తో తన బాధను పంచుకుంది. కన్న కొడుకులే అన్నం పెట్టడం లేదని, కలెక్టరమ్మా మీరైనా తనకు న్యాయం చెయాలంటూ ఆ వృద్ధురాలు వేడుకుంది.
Similar News
News February 5, 2025
ప్రకాశం: వరల్డ్ కప్ విజేతకు ఘన స్వాగతం
ఢిల్లీలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా జట్టు గెలుపులో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. శివారెడ్డి మంగళవారం తన స్వగ్రామం చేరుకున్నాడు. దీంతో అతనికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ ఊరి కుర్రాడు దేశాన్ని వరల్డ్ ఛాంపియన్‌గా నిలపడం గర్వకారణంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు
News February 4, 2025
దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు
దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.
News February 4, 2025
ఒంగోలు: వైసీపీలో ఉండేది ఎవరు.?
ఒంగోలు కార్పొరేషన్ రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. దీంతో వైసీపీలో ఉండే కార్పొరేటర్లు ఎంత మంది అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేటర్లలో అత్యధికులు బాలినేనికి సన్నిహితులు కావడం గమనార్హం.