News January 25, 2025
ఒంగోలు: గణతంత్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన
76వ గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమం నిర్వహించే పోలీసు పరేడ్ గ్రౌండ్‌ను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. SP దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణలతో కలిసి పరిశీలించారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు, వీక్షించేందుకు వచ్చేవారి హోదాను, సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News January 26, 2025
ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో తేనేటి విందు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమం సందడిగా సాగింది. మంత్రి స్వామి, ఎస్పీ దామోదర్, జిల్లా జడ్జి ఏ.భారతి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, మార్కాపురం సబ్‌కలెక్టర్‌గా వెంకట త్రివినాగ్, MLA విజయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News January 26, 2025
కొండపి విద్యార్థుల క్రియేటివిటీ సూపర్
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కొండపి గురుకుల పాఠశాల విద్యార్థులు వినూత్నంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాని పోలిన నమూనాతో పాటు జాతీయ ఓటర్ల దినోత్సవం అక్షరమాల ఆకారంలో కూర్చున్నారు. ఈ చిత్రం పలువురిని ఆకట్టుకుంటోంది. విద్యార్థుల క్రియేటివిటీని పలువురు టీచర్లు అభినందించారు. అనంతరం ఓటు గురించి విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పించారు.
News January 26, 2025
ప్రకాశం కలెక్టర్‌కు అవార్డు
ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2024 లభించింది. శనివారం విజయవాడలోని జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతులమీదుగా అందుకున్నారు. అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన, అర్హులైన వారి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు అవార్డు అందుకున్నారు.