News May 4, 2024
ఒంగోలు: టెన్త్ మార్కుల జాబితాలు సిద్ధం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పొట్టి మార్కుల జాబితాను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వెబ్సైట్ లో సిద్ధంగా ఉన్నట్లుగా డీఈఓ సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వెబ్‌సైట్ నుంచి మార్కుల జాబితాలు డౌన్‌లోడ్ చేసి ప్రధానోపాధ్యాయులు అటెస్టేషన్ చేసి విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. ఈ మార్కులు జాబితాలతో విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందవచ్చన్నారు.
Similar News
News January 2, 2025
ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు ఇంచార్జ్ ఆర్ఎం ఎవరంటే?
ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు దక్షిణాది ప్రాంతీయ ఇన్‌ఛార్జ్ రీజనల్ మేనేజర్‌గా బి. సుబ్బారావు నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఆర్ఎంగా ఉన్న లక్ష్మణ రావు కృష్ణ శ్రీ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ప్రస్తుతం గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుబ్బారావుకు ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు.
News January 2, 2025
బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్య
బాపట్ల జిల్లా నగరం మండలం చిన్నమట్లపూడిలో బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన లుక్క నాగరాజు (43)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నాగరాజు భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రేపల్లె గ్రామీణ సీఐ సురేశ్ బాబు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News January 2, 2025
ఉగ్ర వినూత్న ఆలోచన.. ఆసుపత్రికి మహర్దశ
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నూతన సంవత్సర వేడుకల్లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి విరాళాల సేకరణ చేశారు. బొకేలకు బదులు విరాళాలను టీడీపీ శ్రేణులు, ప్రజలు, అధికారులు విరాళాలను ఆయనకు అందించారు.. విరాళాల రూపంలో రూ. 3,28,773లు సమకూర్చినట్లు ఆయన తెలిపారు. వైద్యశాల అభివృద్ధికి విరాళాలు అందించిన వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.