News December 28, 2024

ఒంగోలు: పదో తరగతి‌ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

జిల్లాలో వచ్చే సంవత్సరం జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజును తత్కాల్ కింద వచ్చే నెల 10వ తేదీ వరకు చెల్లించవచ్చని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. రూ.1000 జరిమానా రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వచ్చే నెల 10వ తేదీలోపు ఆన్‌లైన్లో నామినల్ రోల్స్ అందజేయాలని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

Similar News

News December 29, 2024

క్రికెటర్ నితీశ్‌‌ తల్లిది మన ప్రకాశం జిల్లానే.!

image

ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్‌లో తెలుగు తేజం నితీశ్ కుమార్ సెంచరీ (189 బంతుల్లో 114)తో దుమ్ములేపిన సంగతి తెలిసిందే. కాగా నితీశ్ తల్లి జోత్స్న ప్రకాశం జిల్లా వాసులే కావడం గమనార్హం. ఆమె ఒంగోలు మండలంలోని చెరువుకొమ్మాలెం గ్రామానికి చెందిన వారు. అలాగే నితీశ్ కుటుంబీకులు మేనమామలు, తాతయ్య, అమ్మమ్మలు జిల్లాలోనే ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో నితీశ్ ప్రతిభ చాటడంతో ఆ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 29, 2024

ప్రకాశం: పదో తరగతి‌ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లాలో వచ్చే సంవత్సరం జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజును తత్కాల్ కింద వచ్చే నెల 10వ తేదీ వరకు చెల్లించవచ్చని DEO కిరణ్ కుమార్ తెలిపారు. రూ.1000 జరిమానా రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వచ్చేనెల 10వ తేదీలోపు ఆన్‌లైన్లో నామినల్ రోల్స్ అందజేయాలని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

News December 29, 2024

పీఎం సూర్యఘర్ పథకం అమలుపై కలెక్టర్ సమావేశం

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని పీఎం సూర్యఘర్ పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. 5వేలకు పైగా జనాభా ఉండి, సౌర విద్యుత్ వినియోగించే గ్రామాలను గుర్తించాలన్నారు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు.