News March 21, 2025
ఒంగోలు: పసికందు హత్య.. తండ్రికి యావజ్జీవ శిక్ష.!

భార్య పైన అనుమానంతో మూడేళ్ల పసికందును హత్య చేసిన కసాయి తండ్రి ఖాదర్‌కి ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి భారతి గురువారం యావజ్జీవ శిక్ష విధించారు. చీమకుర్తిలో భార్య సాల్మాతో కలిసి భర్త ఖాదర్ నివాసం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. ఏడేళ్ల క్రితం భార్యపై అనుమానంతో కుమారుడు సాహుల్ గొంతు కోసి హత్య చేశాడు. నింద రుజువైనందున ఎట్టకేలకు ఏడేళ్లకు అతనికి యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది.
Similar News
News March 31, 2025
రెండు రోజులు ఎండలు.. ఏప్రిల్ 3న వడగండ్లు

TG: రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. నిన్న 16 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో వైపు ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. వచ్చే నెల 3న వడగండ్లు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.
News March 31, 2025
సాటాపూర్ గేట్ వద్ద వడ్ల లారీ బోల్తా

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద ఆదివారం రాత్రి వడ్ల లారీ బోల్తా పడింది. ఎడపల్లి వైపు వెళ్తున్న ధాన్యం లారీ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు.
News March 31, 2025
గుంటూరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

రంజాన్ పర్వదిన సందర్భంగా నేడు PGRS కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.