News April 5, 2025
ఒంగోలు: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడండి: కలెక్టర్

ఈ వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. శుక్రవారం వేసవిలో తాగునీటి సరఫరా వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News April 7, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి 92 అర్జీలు

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి 92 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు.
News April 7, 2025
ప్రకాశం: పండుగ రోజు విషాదం

ప్రకాశం జిల్లాలో శ్రీరామనవమి రోజున విషాదం నెలకొంది. త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి వద్ద ముగ్గురు యువకులు బైక్‌పై ప్రయాణిస్తూ.. అదుపు తప్పి కిందపడ్డారు. వీరిలో నాగిరెడ్డి అనే యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో మృతి చెందాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే దొనకొండ మండలం గుట్టమీదపల్లికి చెందిన పిక్కిలి తరుణ్(13) నీటి కుంటలో పడి మృతి చెందాడు.
News April 7, 2025
దొనకొండ: నీటి కుంటలో పడి బాలుడి మృతి

దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు… బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.