News March 19, 2024
ఒంగోలు: వైసీపీకి మేలు చేశారన్న అభియోగంపై టీచర్ రిలీవ్

రానున్న ఎన్నికలలో వైసీపీకి మేలు చేసేలా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎం.ప్రసాద్ వ్యవహరిస్తుండడంతో ఆ బాధ్యత నుంచి రిలీవ్ చేశారు. ఒంగోలులో ఆయన ప్రస్తుతం సిబ్బందికి ఎన్నికల విధులు వేసే పనిలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయిస్తున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 5, 2025
మార్కాపురం: రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం

మార్కాపురం రైల్వే స్టేషన్ ఔటర్ వద్ద పట్టాల పక్కన శనివారం మధ్యాహ్నం వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా రైల్లో నుంచి జారిపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News April 5, 2025
ఒంగోలు: బాధ్యతలు స్వీకరించిన సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ

ప్రకాశంజిల్లా గ్రంథాలయం సంస్థ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా సంయుక్త కలెక్టర్ రోణంకి. గోపాలకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించడానికి జిల్లాల జాయింట్ కలెక్టర్‌లను పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంథాలయం సంస్థకు రావలసిన సెస్సులు, గ్రంధాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
News April 5, 2025
గిద్దలూరు: ఆత్మహత్య చేసుకొని రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి

గిద్దలూరులోని కొంగలవీడు రోడ్డులో బిలాల్ మసీదు సమీపంలో ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొమరోలు మండలం అయ్యవారిపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ ముక్కర చెన్నారెడ్డి అనే వ్యక్తి గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.