News March 24, 2025

ఒంగోలులో ESI ఆసుపత్రి స్థాపించాలి: మాగుంట

image

ఒంగోలులో ESI ఆసుపత్రిని స్థాపించాలని పార్లమెంట్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. రూల్ నం. 377 క్రింద ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో 3003 కర్మాగారాలలో 86000 మంది ఉద్యోగ కార్మికులు ఉన్నారని, వారందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపించాలని మాగుంట కోరారు.

Similar News

News March 26, 2025

ప్రకాశం: పాఠశాలల్లో వాటర్ బెల్..!

image

ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమం నిర్వహిస్తామని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఒంటిపూట బడుల నేపథ్యంలో ఉదయం 10, 11, 12 గంటల సమయాల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ నిర్వహించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు.

News March 26, 2025

ప్రకాశం: వైసీపీకి మరో షాక్ తప్పదా..?

image

ప్రకాశం జిల్లాలో YCPకి షాక్ ఇచ్చేందుకు TDP పావులు కదుపుతోంది. మార్కాపురం, త్రిపురాంతకం MPP ఎన్నిక గురువారం జరగనుంది. పుల్లలచెరువులో వైస్ MPP, ఎర్రగొండపాలెంలో కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక సైతం నిర్వహిస్తారు. అన్ని చోట్లా YCPకి పూర్తి మెజార్టీ ఉన్నా ఆయా స్థానాలను దక్కించుకోవడానికి TDP గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కొందరు స్వచ్ఛందంగా టీడీపీ గూటికి చేరగా.. మరికొందరిని కొన్ని హామీలతో తమవైపు తిప్పుకుంటోంది.

News March 26, 2025

జగన్‌ను కలిసిన ఆళ్ల సతీమణి

image

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డిని అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వైసీపీ అధినేత జగన్‌ను ఆంజనేయరెడ్డి సతీమణి సుబ్బమ్మ కలిశారు. పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె జగన్ వద్ద వాపోయారు. పార్టీ అండగా ఉంటుందని జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు. మాజీ సీఎంను కలిసిన వారిలో బూచేపల్లి ఫ్యామిలీ, చెవిరెడ్డి ఉన్నారు.

error: Content is protected !!