News April 7, 2025
ఒంటిమిట్ట: అధికారులకు మంత్రుల దిశానిర్దేశం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సవితలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన మందిరంలో సమావేశం నిర్వహించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Similar News
News April 8, 2025
కడప: ‘మహానాడును విజయవంతం చెయ్యండి’

మహానాడును విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. సోమవారం కడప నగరంలో వివిధ చోట్ల మహానాడు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సమన్వయంతో పనిచేసి, కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యలని సూచించారు.
News April 7, 2025
కడప: నదిలో యువకుడి గల్లంతు

కడప నగర సమీపాన ఉన్న వాటర్ గండిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నగరంలోని రియాజ్ థియేటర్ సమీపంలోని సమీర్ (17) తన స్నేహితులతో కలిసి ఈత కోసం ఆదివారం పెన్నానదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ అందులో మునిగారు. స్థానికులు గమనించి అందులో ఇద్దరిని కాపాడారు. సమీర్ కనిపించలేదని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 7, 2025
బద్వేల్: అత్తింటికే కన్నం వేసిన అల్లుడు

అత్తింటికే అల్లుడు కన్నం వేసిన ఘటన బద్వేల్లో చోటు చేసుకుంది. గోపవరం(M) T.సండ్రపల్లెకు చెందిన పిచ్చయ్య, పెంచలమ్మ కొన్నేళ్లుగా బద్వేల్‌లోని తెలుగుగంగ కాలనీలో ఉంటున్నారు. పెద్ద కూతురుకి మురళితో వివాహం చేశారు. ఇటీవల పిచ్చయ్య అనారోగ్యంతో చనిపోయారు. అంత్యక్రియల కోసం T.సండ్రపల్లెకు వెళ్లారు. ఇదే అదునుగా బద్వేల్‌లోని అత్త ఇంట్లోకి మురళి చొరబడి రూ.7 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.