News April 6, 2025
ఒంటిమిట్ట శ్రీ రాములవారి కళ్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం

ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో ఆదివారం తలంబ్రాల తయారీ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సీతారాముల కళ్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమం శ్రీవారి సేవకులతో టీటీడీ ప్రారంభించింది.
Similar News
News April 7, 2025
BREAKING: వల్లభనేని వంశీకి బెయిల్

AP: భూకబ్జా కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది. మరోవైపు టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులోనూ వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
News April 7, 2025
BREAKING: పరీక్ష తేదీలు వచ్చేశాయ్

AP: పలు పోటీ పరీక్షల తేదీలను APPSC ప్రకటించింది. పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల భర్తీకి సంబంధించి జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు CBT విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయని, జూన్ 20 నుంచి 22 వరకు పరీక్షలు జరగవని పేర్కొంది. పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ <
News April 7, 2025
సింగపూర్ కాన్సులేట్‌తో ఐటీ మంత్రి సమావేశం

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్‌తో సోమవానం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, తెలంగాణను ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. రాష్ట్రం నుంచి రెండు లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజినీర్లను సిద్ధం చేయడం తమ ప్రధాన లక్ష్యమని శ్రీధర్‌బాబు తెలిపారు.