News April 24, 2024

ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కళ్యాణం

image

ఒంటిమిట్ట శ్రీకోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాములను పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించి రామాలయం నుంచి ఊరేగింపుగా కళ్యాణ మండపం దగ్గరకు తీసుకెళ్లారు. తెలుగుదనం ఉట్టిపడేలా సీతారాముల కళ్యాణాన్ని  అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కళ్యాణ మండపం కిటకిటలాడింది.

Similar News

News December 13, 2025

తొండూరులో 9 మంది విద్యార్థులకు అస్వస్థత

image

తొండూరు మండలంలోని యాదవారిపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనం తిన్న 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు విరేచనాలు అవుతుండడంతో తొండూరు 108 వాహనంలో చికిత్స నిమిత్తం పులివెందుల హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 13, 2025

వరంగల్‌లో బద్వేల్‌కు చెందిన ప్రొఫెసర్ సూసైడ్

image

కడప జిల్లా బద్వేల్‌కి చెందిన ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి వరంగల్ NITలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసును హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 13, 2025

కడప: నేడు నవోదయ ఎంట్రన్స్.. ఇవి పాటించండి.!

image

జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని డిఇఓ శంషుద్దీన్ పేర్కొన్నారు. నేడు కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.