News February 14, 2025
ఒక్క డోర్ మాత్రమే తెరచి ఉండేలా చూడాలి: కలెక్టర్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి జివిఎంసి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రం, బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు ఒక్క డోర్ మాత్రమే తెరచి ఉండేలా చూడాలన్నారు.
Similar News
News February 21, 2025
ఈరోజు నమాజ్ వేళలు

తేది: ఫిబ్రవరి 21, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 21, 2025
సంగారెడ్డి: వసతిగృహం సిబ్బందిపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు

కంగ్టి మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్పేర్ కళాశాల వసతి గృహంలో విద్యార్థులతో పనిచేయిస్తున్న సిబ్బంది విషయంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చర్యలు చేపట్టారు. ఉదయం అల్పాహారాన్ని విద్యార్థులతో స్వయంగా తయారు చేయించిన హాస్టల్ సిబ్బందిపై విచారణ చేపట్టి రిపోర్ట్ సమర్పించాలని నారాయణఖేడ్ ఆర్‌డీఓ అశోక్ చక్రవర్తిని ఆమె గురువారం ఆదేశించారు.
News February 21, 2025
22న కుప్పానికి హైపర్ ఆది రాక

ప్రముఖ బుల్లితెర నటుడు హైపర్ ఆది ఈనెల 22న కుప్పంకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కుప్పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ డే వేడుకలలో పాల్గొననున్నట్లు ఆది తెలిపారు. కుప్పం పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, 22న కుప్పంలో కలుద్దామంటూ ఆది పిలుపునిచ్చారు. కాగా కార్యక్రమానికి ఆదితోపాటూ, మరో నటుడు రాంప్రసాద్ సైతం వస్తున్నారు.