News February 6, 2025

ఒక్కరోజు వ్యవధిలోనే గుండెపోటుతో తండ్రి, కొడుకు మృతి

image

ఒక్కరోజు వ్యవధిలోనే తండ్రి, కొడుకు గుండెపోటుతో మృతి మృతిచెందారు. ఈ విషాద ఘటన మండల కేంద్రం చాగలమర్రిలో జరిగింది. కోటగడ్డ వీధికి చెందిన కుమారుడు ముల్లా రబ్బాని(28) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందగా, ఆ బాధతో తండ్రి జహంగీర్ బాషా(60) నేడు గుండెపోటుకు గురై మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 6, 2025

MBNRలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా న్యూ టౌన్‌లో జరిగింది. స్థానికుల వివరాలు.. నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19), నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) పట్టణంలోని మెడికల్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నారు. బైక్‌పై వెళుతున్న ఇద్దరూ.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 6, 2025

భద్రాద్రి: కుటుంబ కలహాలతో ఏఆర్ ఎస్సై ఆత్మహత్య.. UPDATE

image

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏఆర్ ఎస్సై సువర్ణపాక లక్ష్మీ నర్సు(36) <<15377589>>ఆత్మహత్యకు<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని 15వ బెటాలియన్‌కు చెందిన లక్ష్మీనర్సు భద్రాద్రి, బయ్యారం ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. భార్య సునీతను ఇంటి నుంచి గెంటి వేశారని, ఆమె హన్మకొండలోని బంధువుల ఇంటికి పిల్లలతో వెళ్లడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

News February 6, 2025

PPM: వీడీవీకెలను బలోపేతం చేయాలి- కలెక్టర్

image

మన్యం జిల్లాలో ప్రధానమంత్రి వన్ ధన్ వికాస కేంద్రాల (వీడీవీకే) కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్‌ శ్యామ్ ప్రసాద్, గిరిజన సహకార కార్పొరేషన్ (జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి పార్వతీపురం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 68, సీతంపేట ఐటీడీఏ పరిధిలో దాదాపు 54 వీడీవీకెలు ఉన్నాయి.

error: Content is protected !!