News July 12, 2024
ఒడిశాకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి

మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఒడిశా బయలుదేరారు. కాగా 2015లో ఒడిస్సా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గని సింగరేణికి కేటాయించారు. ఈ బొగ్గు గని ప్రారంభం సజావుగా నిర్వహణకు సహకరించాల్సిందిగా కోరేందుకు డిప్యూటీ సీఎం ఒడిశా వెళ్లారు. మరికొద్ది సేపట్లో ఒడిశా సీఎం మోహన్ చరణ్‌తో డిప్యూటీ సీఎం భేటీ అయి బొగ్గు గని ప్రారంభంపై చర్చించనున్నారు.
Similar News
News March 13, 2025
‘ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు’

∆} సత్తుపల్లి: ‘మద్యం మత్తులో ఢీ.. ఇద్దరికి గాయాలు’ ∆} ఖమ్మం: కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ ∆} సత్తుపల్లి: పురుగు మందుతో రైలు పట్టాలపై ఆందోళన ∆} వైరాలో ప్రమాదం.. ఒకరు మృతి ∆} ఖమ్మం: ఐదుగురికి షోకాజ్ నోటీసులు ∆}ఖమ్మం: ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం ∆}ఖమ్మం: ఎలక్ట్రికల్ షాప్‌లో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం ∆} ఖమ్మం: ‘ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి’.
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ఖమ్మం జిల్లాకి ఏం కావాలంటే..?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.ఖమ్మం మున్నేరు పై తీగల వంతెన నిర్మాణం, పాలేరు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిధులు, సీతారామ ప్రాజెక్ట్, రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలంటున్నారు.
News March 12, 2025
ఖమ్మం: పట్టుపట్టాడు.. కొలువులు సాధిస్తున్నాడు..

పట్టుదలతో ప్రభుత్వ కొలువులు సాధించుకుంటూ వస్తూ యువతకు ఆదర్శంగా నిలిచాడు. తాజాగా గ్రూప్- 2లో 387 మార్కులతో స్టేట్ 148 ర్యాంక్, జోన్‌లో 20వ ర్యాంక్ సాధించాడు. అతడే తల్లాడ మండలం మల్లవరంకు చెందిన దుగ్గిదేవర వెంకటేశ్వరరావు. తొలి ప్రయత్నంలోనే 2018లో పంచాయితీ కార్యదర్శిగా, 2019లో FBOగా, 2020లో విద్యుత్ శాఖలో జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ కొలువులను వరుసగా సాధిస్తూ వచ్చాడు.