News August 29, 2024

ఓటరు జాబితా రూపకల్పనకు పటిష్ట చర్యలు: పార్థసారథి

image

ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్త పట్నాయక్ పాల్గొన్నారు. గ్రామాలలో 18 సంవత్సరాలకు పైబడిన వారికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

Similar News

News November 27, 2024

MBNR: ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించిన సీఎం

image

న్యూఢిల్లీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, గన్ని సంచులు, ప్యాడీ క్లీనర్స్, అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్ లైన్‌లో నమోదు చేసి రైతులకు వెంటవెంటనే డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News November 26, 2024

మాగనూరు: జిల్లా పరిషత్ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్

image

మాగనూరు మండల జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన పునరావృతమైంది. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన పునరావృతం అవ్వడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News November 26, 2024

MBNR: భార్యను చంపి సెప్టిక్ ట్యాంకులో పడేశాడు!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. భూత్పూర్ మం. ఎల్కిచెర్లలో నారమ్మను భర్త వెంకటయ్య హతమార్చాడు. అనంతరం సెప్టిక్ ట్యాంక్‌‌లో పడేసి ఏమీ తెలియనట్లే ఉన్నాడు. ఈ నెల 17న నారమ్మ కనిపించడం లేదంటూ కుమారుడు భరత్‌‌తో నాటకమాడారు. దీంతో 21న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.