News September 24, 2024
ఓటరు నమోదు కట్టుదిట్టంగా నిర్వహించాలి: సుదర్శన్ రెడ్డి
ఓటర్ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఇంటింటి సర్వేలో ఆధార్ నంబర్ సేకరణ తప్పనిసరి కాదని, ఓటర్లు ఇష్టం ఉంటే ఇవ్వవచ్చన్నారు. సెప్టెంబర్ 28 నాటికి ఇంటింటి సర్వే వంద శాంతం పూర్తి చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు తదితరులున్నారు.
Similar News
News November 6, 2024
BREAKING.. KNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్
KNR జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. రామడుగు మండలం షానగర్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. రామడుగు మండల కేంద్రం నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం షానగర్ శివారు ప్రాంతంలో కరీంనగర్ నుంచి బైకుపై వెళ్తున్న శివాజీ, అరుణ్‌ను ఢీ కొట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 5, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ.
@ రామడుగు మండలంలో బొలెరో, బైక్ ఢీ.. ఒకరి మృతి.
@ వేములవాడ మండలంలో కారు, బైకు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.
@ మెట్పల్లిలో ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి.
News November 5, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారికి రూ.2,27,188 ఆదాయం
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.2,27,188 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,57,776, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.45,690, అన్నదానం రూ.23,732,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.