News May 13, 2024

ఓటు వేసిన అల్లూరి జిల్లా కలెక్టర్

image

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాడేరులోని కృష్ణాపురం ఆశ్రమ పాఠశాలలోని 284 పోలింగ్ కేంద్రంలో సోమవారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలోని ఓటర్లందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News January 24, 2025

కొత్తపల్లి జలపాతం నాలుగు రోజులు మూసివేత

image

జీ.మాడుగుల మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొత్తపల్లి జలపాతాన్ని ఈనెల 24 నుంచి 27 వరకు మూసివేస్తున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం తెలిపారు. జనవరి 24వ తేదీ నుంచి 27 వరకు జలపాతం ఆధునీకరణ పనులు జరుగుతున్నందున ఎవరికి ప్రవేశం లేదని చెప్పారు. ఈ విషయాన్ని గమనించి పర్యాటకులు కొత్తపల్లి జలపాతం సందర్శించవద్దని అభిషేక్ పేర్కొన్నారు.

News January 23, 2025

విశాఖ-దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు కోచ్‌లు కుదింపు

image

విశాఖ-దుర్గ్ వందేభారత్ (20829/30) ఎక్స్‌ప్రెస్‌కు కోచ్‌లు కుదించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఇప్పటివరకు ఈ రైలు 16 కోచ్‌లతో నడిచేది. అయితే జనవరి 24వ తేదీ నుంచి 8 కోచ్‌లతో మాత్రమే నడుస్తుందని ఆయన తెలిపారు. అందులో ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్, ఏడు ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News January 23, 2025

విశాఖ: పుట్టినరోజు నాడే కానిస్టేబుల్ అభ్యర్థి మృతి

image

విశాఖ ఏఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో గురువారం ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది.1,600 మీటర్ల రన్నింగ్ అనంతరం సొమ్మసిల్లి పడిపోయిన శ్రవణ్ కుమార్‌ను నిర్వాహక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు నాడే శ్రవణ్ కుమార్ మృతి చెందటం పట్ల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీస్ అవుతాడానుకుంటే అందరాని దూరాలకు వెళ్లిపోయాడని విలపిస్తున్నారు.