News April 5, 2025

ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారుల ఆదేశించారు. జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహణపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

Similar News

News April 5, 2025

అల్లు అర్జున్ సినిమాలో క్రేజీ హీరోయిన్?

image

‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రివిక్రమ్ లేదా అట్లీ దర్శకత్వంలో ఆయన నటిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. AAతో అట్లీ తెరకెక్కించే సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తారని సినీ వర్గాల్లో టాక్. ఇప్పటికే ఈ బ్యూటీ SSMB29లో నటిస్తున్నారు. ఈ క్రమంలో AA సినిమాలోనూ నటిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

News April 5, 2025

కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించండి: బండి సంజయ్

image

TG: TTD ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. 2023 మే 31న 10 ఎకరాల విస్తీర్ణంలో భూమి పూజ చేసినప్పటికీ పనులు జరగలేదని తెలిపారు. ఆలయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

News April 5, 2025

మార్కాపురం: రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం

image

మార్కాపురం రైల్వే స్టేషన్ ఔటర్ వద్ద పట్టాల పక్కన శనివారం మధ్యాహ్నం వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా రైల్లో నుంచి జారిపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి  వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

error: Content is protected !!