News March 19, 2024
ఓయూ బీసీఏ పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 8, 2025
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 2.13 కోట్ల మంది ప్రయాణం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 15.20% వృద్ధి సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయంగా నిలిచి రికార్డు సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.
News April 8, 2025
HYD- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

HYD- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్ ప్రకటించారు. మే 23వ తేదీ వరకు వారానికి 2 సార్లు ఈ ట్రైన్ సేవలందిస్తుంది. చర్లపల్లి నుంచి (07017) శుక్ర, ఆదివారాల్లో, తిరుపతి నుంచి (07018) శని, సోమవారాల్లో నడుస్తుంది. మల్కాజిగిరి, కాచిగూడ, జడ్చర్ల, మహబూబ్‌నగర్, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి నుంచి రాత్రి 9.35కు, తిరుపతి నుంచి సాయంత్రం 4.40కు బయలుదేరుతుంది.
News April 8, 2025
BREAKING..శామీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

శామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్‌గడి మలక్‌పేట్ హైవేపై సఫారీ, కారు డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్‌కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్‌కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్‌గా పోలీసులు గుర్తించారు.