News February 7, 2025
ఓర్వకల్లు వద్ద ఘోర ప్రమాదం.. UPDATE
ఓర్వకల్లు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులు జానకి(60), విహారిక(4) కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది.
Similar News
News February 7, 2025
శ్రేయస్ అయ్యర్ ఆటతో భారత్ గెలిచింది: జహీర్ ఖాన్
ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను మాజీ పేసర్ జహీర్ ఖాన్ కొనియాడారు. ‘శ్రేయస్ ఆట చాలా చూడముచ్చటగా అనిపించింది. రెండు వికెట్లు కోల్పోయిన దశలో అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చారు. మరో వికెట్ పడి ఉంటే ఛేజింగ్ ఇబ్బంది అయ్యేదే. ఇన్నింగ్స్ చివరికి వచ్చేసరికి బంతి ఎలా గింగిరాలు తిరిగిందో చూశాం. కానీ తన దూకుడైన ఆటతో అయ్యర్ ఛేదనను సులువు చేసేశారు’ అని ప్రశంసించారు.
News February 7, 2025
సంగారెడ్డి: సర్వే డబ్బుల కోసం ఎదురుచూపులు
జిల్లాలో నిర్వహించిన సర్వేలో విధులు నిర్వహించిన ఎన్యుమరేటర్లకు డబ్బులు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సర్వే పూర్తై రెండు నెలలు అయినా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదన్నారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఎన్యుమరేటర్లకు త్వరగా డబ్బులు చెల్లించేలా చూడాలని వారు కోరుతున్నారు.
News February 7, 2025
స్వర్ణకవచ అలంకారంలో దర్శనమిచ్చిన రామయ్య
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారు స్వర్ణకవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ,ఆరాధన, ఆరగింపు, సేవాకాలం తదితర నిత్య పూజలు భక్తి ప్రపత్తులతో జరిపారు. అనంతరం స్వామివారి నిత్య కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపి, భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.