News January 12, 2025

ఓర్వ‌క‌ల్లుకు జపాన్ కంపెనీ

image

క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు పారిశ్రామిక పార్కులో సెమీ కండక్టర్ రంగంలో రూ.14 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఇండిచిప్ సెమీ కండక్టర్ లిమిటెడ్ కంపెనీ తన భాగస్వామి జపాన్‌కు చెందిన యిటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో MOU కుదుర్చుకున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు.

Similar News

News January 12, 2025

భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

గ్రీన్‌ కో సభ్యులతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ

image

కర్నూలు జిల్లా పిన్నాపురం పర్యటనలో భాగంగా శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్‌ కో ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఉద్యోగులు, కార్మికులతో సెల్ఫీ దిగారు. ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా పవన్ కళ్యాణ్ స్వయంగా కారు డ్రైవ్ చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ చీఫ్ ఆయనకు గ్రీన్ కో కంపెనీ గురించి వివరించారు.

News January 12, 2025

జిల్లాలో రూ. 14 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం: మంత్రి టీజీ

image

క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు పారిశ్రామిక పార్కులో సెమీ కండక్టర్ రంగంలో రూ. 14 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఇండిచిప్ సెమి కండక్టర్ లిమిటెడ్ కంపెనీ తన భాగస్వామి జపాన్‌కు చెందిన యిటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో హైదరాబాదులో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎం.ఓ.యూ కుదుర్చుకున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు.