News April 24, 2025

కంచరపాలెం: బస్సు ఢీకొని మహిళ మృతి

image

కంచరపాలెం ఊర్వశి జంక్షన్ దగ్గర గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు మహిళలను విజయవాడ నుంచి పార్వతీపురం వైపు వెళుతున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న ఎన్.మేరీ (62 ) అక్కడికక్కడే చనిపోగా, డ్రైవ్ చేస్తున్న కూతురు సుధారాణి(40)కి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 24, 2025

ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పే ఔత్సాహికుల‌కు పూర్తి స‌హ‌కారం: కలెక్టర్

image

ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పేందుకు ముందుకు వ‌చ్చే పారిశ్రామిక ఔత్సాహికుల‌కు అన్ని విధాలుగా పూర్తి స‌హ‌కారం అందించాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హరేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మాణాల‌కు, ప‌రిశ్ర‌మ‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన నీటి వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చాల‌న్నారు. భూ సేక‌ర‌ణ‌, సింగిల్ విండో క్లియ‌రెన్స్ అంశాల్లో వేగం పెంచాల‌ని ఆదేశించారు.

News April 24, 2025

దువ్వాడ మీదగా చర్లపల్లి, సంబల్ పూర్‌కు ప్రత్యేక రైళ్లు

image

వేసవి రద్దీ దృష్ట్యా దువ్వాడ మీదగా చర్లపల్లి, సంబల్ పూర్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. విశాఖ -చర్లపల్లి (08579/80), ఈనెల 25 నుంచి మే 30 వరకు, సంబల్ – ఈ రోడ్డు (08311) మే 7 నుంచి జూన్ 25 వరకు ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News April 24, 2025

నేడు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

image

ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళికు నివాళులర్పించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖ రానున్నారు. తిరుపతి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు సాయంత్రం 6.15కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాండురంగపురం వెళ్లి చంద్రమౌళికి నివాళి అర్పిస్తారు. రాత్రికి విశాఖలోనే బస చేసి, శుక్రవారం ఉదయం 9.15 గంటలకు విమానంలో రాజమండ్రికి బయలుదేరుతారు.

error: Content is protected !!