News March 22, 2024
కందికుంట వెంకటప్రసాద్‌ను నిర్దోషిగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు
కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. వెంకట ప్రసాద్‌పై గతంలో సీబీఐ, హైదరాబాద్ కోర్టు విధించిన ఐదు, ఏడు సంవత్సరాల శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఇవాళ తీర్పు వెల్లడించింది. క్రిమినల్ ఆపిల్ నెంబర్ 454/2016, 1382/2017లను అనుమతిస్తూ క్రింది కోర్టు ఇచ్చిన శిక్షణ హైకోర్టు రద్దు చేసింది.
Similar News
News November 17, 2024
24 గంటల్లో 513 కేసులు పెట్టిన అనంతపురం పోలీసులు
అనంతపురం జిల్లాలో నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై పోలీసులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా హెల్మెట్/ సీటు బెల్టు ధరించని వారు, ట్రిపుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్‌పై తనిఖీలు చేపట్టారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు 513 కేసులు నమోదు చేశారు. వీరికి రూ.1.10 లక్షల ఫైన్ వేశామని ఎస్పీ జగదీశ్ తెలిపారు. అలాగే రాత్రి జిల్లా వ్యాప్తంగా 154 ఏటీఎంలను తనిఖీ చేశారు.
News November 17, 2024
అనంత: నేడు నిశ్చితార్థం.. అంతలోనే విషాదం
తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గీతా అనే యువతి మృతిచెందిన విషయం విధితమే. ఆ యువతికి నేడు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గీత, ఆమె తమ్ముడు నారాయణరెడ్డి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.
News November 17, 2024
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి: ఎస్పీ
అనంతపురం జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారి పై 24 గంటల్లో 513 కేసులు నమోదు చేసి రూ.1.10 లక్షలు జరిమానాలు వేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. మద్యం తాగి అతివేగంగా వాహనాలు నడపరాదని తెలిపారు.