News March 25, 2024
కందుకూరులో వివాహిత దారుణ హత్య

కందుకూరు పట్టణంలో సోమవారం వివాహిత దారుణ హత్యకు గురైంది. గాయత్రీ నగర్‌లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న వనజాక్షి(27) ఇంట్లో రక్తపు మడుగులో చనిపోయి ఉంది. కుమార్తెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళిన వనజాక్షి తండ్రికి ఆమె శవమై కనిపించింది. వనజాక్షి భర్తే హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ నఫీస్ బాషా కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 21, 2025
ప్రకాశం: పుట్టింటి నుంచి ఆలస్యంగా వచ్చిందని.!

పేర్నమిట్టలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పేర్నమెట్టకు చెందిన నవీన్.. భార్య శ్రావణి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆమె పుట్టినిల్లు అయిన జమ్ములపాలెంకు వెళ్లింది. అదే రోజు రమ్మని నవీన్ కోరగా ఆమె మరుసటి రోజు వచ్చింది. దీంతో అనుమానం పెంచుకున్న నవీన్ ఆదివారం ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కడంతో ఆమె మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
బేస్తవారిపేట: పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి

బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లిలో విషాదం నెలకొంది. ఆదివారం క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పెద్ద ఓబులేనిపల్లికి చెందిన ఆకాశ్, సన్నీగా గ్రామస్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News April 20, 2025
ప్రకాశం: భార్యను హతమార్చిన భర్త

ఉమ్మడి ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భార్య నీలం మంగమ్మ (45)ను భర్త నీలం శ్రీనివాసరావు హతమార్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.