News March 29, 2025
కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి: బాపట్ల కలెక్టర్

సహకార సంఘాల కంప్యూటరీకరణను వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శనివారం బాపట్ల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలలోని సహకార సంఘాల వివరాలను కంప్యూటరీకరణ చెయ్యడంలో అధికారులు అలసత్వం వహించడంపై కలెక్టర్ అసహనం వ్యక్తపరిచారు.
Similar News
News April 2, 2025
ఏప్రిల్ 12-15 మధ్య ఇంటర్ ఫలితాలు?

AP: రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 – 15వ తేదీల మధ్య విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాగా ఏప్రిల్ 6న ముగియనుంది. ఆ తర్వాత వాటిని కంప్యూటర్‌లో నమోదు చేయడానికి ఐదారు రోజులు పడుతుందని, ఆ తర్వాతే ఫలితాలు రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా.. 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.
News April 2, 2025
పోలీసులతో బెదిరించినా తెగువ చూపారు.. హ్యాట్సాఫ్: YS జగన్

AP: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు అధికార అహంకారంతో ఎలాగైనా గెలవాలని చూశారని YCP అధినేత జగన్ అన్నారు. ‘రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని నేను. ఉప ఎన్నికల్లో మన కార్యకర్తలు చూపిన తెగువ, ధైర్యానికి హ్యాట్సాఫ్. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు గెలిచాం. TDPకి సంఖ్యా బలం లేకున్నా పోలీసులతో బెదిరించారు’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో వ్యాఖ్యానించారు.
News April 2, 2025
స్టూడెంట్ తండ్రికి టీచర్ ముద్దులు.. చివరకు..

బెంగళూరులో శ్రీదేవి అనే ప్రీ స్కూల్ టీచర్ ఓ విద్యార్థిని తండ్రిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసింది. తొలుత అతడి వద్ద నుంచి రూ.4లక్షలు అప్పుగా తీసుకున్న ఆమె, ఆ తర్వాత అతడితో ఏకాంతంగా గడిపింది. అతడికి ముద్దు పెట్టిన ఫొటోలు, వీడియో చాట్‌లను బయటపెడతానంటూ విడతల వారీగా డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో చివరకు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు శ్రీదేవి, ఆమె ప్రియుడు సాగర్, రౌడీ షీటర్ గణేశ్‌ను అరెస్ట్ చేశారు.