News October 8, 2024
కడప: 10న ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాల్లో సేవలు
కడప డివిజన్ పరిధిలో జాతీయ తపాలా వారోత్సవాలలో భాగంగా గురువారం అక్టోబర్ అంత్యోదయ దివాస్ సందర్భంగా ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కడప డివిజన్ పోస్టల్ ఇన్ఛార్జ్ రాజేశ్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7:00 వరకు అందుబాటులో ఉంటారన్నారు. కడపతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సేవలు ఉంటాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 22, 2024
కొండాపురం : గండికోట ముంపు వాసులకు అండగా ఉంటాం
గండికోట జలాశయాన్ని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్యాగ సీనులైనా గండికోట ముంపు వాసులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఉన్నారు. MLA ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి, ఉన్నతాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News December 22, 2024
రాయచోటిలో కాల్పుల కలకలం
అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి రాయచోటి మండలం మాధవరంలో ఈరోజు ఉదయం దుండగులు ఇద్దరు వ్యాపారులపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో స్థానికులు బాధితులను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News December 22, 2024
జనవరి 29 నుంచి దేవుని కడప శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుమలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జనవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.