News March 27, 2025
కడప: 98 ఏళ్ల వయసులోనూ ఓటేసిన జడ్పీటీసీ

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ఓ స్ఫూర్తిదాయక దృశ్యం కనిపించింది. గురువారం కడప నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఛైర్మన్ ఎన్నికలో ఉమ్మడి కడప జిల్లా గాలివీడు జడ్పీటీసీ షేక్ భానూ బీ 98ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలో ప్రతి ఓటు కీలకం అయిన నేపథ్యంలో ఆమె ఓటు వేసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
Similar News
News April 1, 2025
ఒక్క మందుతో గుండెపోటు, స్ట్రోక్ దూరం!

గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించగల ‘లెపొడిజిరాన్’ మెడిసిన్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని అమెరికాకు చెందిన ఎలి లిల్లీ అనే ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది. ఏడాదికి ఒక్కసారి వేసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 94శాతం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా ఈ పరిశోధనలో 6 నెలల పాటు దీని ప్రభావం ఉన్నప్పటికీ, దుష్ప్రభావాలు కనిపించలేదు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
News April 1, 2025
NGKL: యువతి ఒంటరిగా రావడం అదునుగా తీసుకున్నారు: ఐజీ

NGKL జిల్లా ఊర్కొండపేట ఆలయానికి వచ్చిన వివాహిత గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనా స్థలాన్ని ఈరోజు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. అత్యాచారం చేసిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఆమె ఒంటరిగా రావడాన్ని వారు అదునుగా తీసుకున్నారని తెలిపారు. యువతిని బెదిరించి అత్యాచారం చేశారని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు.