News December 27, 2024
కడప: YVU పీజీ పరీక్షల తేదీల్లో మార్పులు
యోగి వేమన యూనివర్సిటీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. అనుబంధ పీజీ కళాశాల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 30 నుంచి జరగాల్సి ఉండగా.. 2025 జనవరి 21వ తేదీకి మార్చినట్లు ప్రిన్సిపల్ ఎస్ రఘునాథరెడ్డి తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేశామన్నారు. MA, Mcom, Msc, Mped ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.
Similar News
News December 28, 2024
పవన్ కళ్యాణ్ కడప పర్యటన వివరాలివే.!
పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. YCP నాయకుల దాడిలో గాయపడ్డ గాలివీడు MPDOను ఆయన నేరుగా పరామర్శించనున్నారు. గన్నవరం నుంచి కడప ఎయిర్ పోర్టుకు 10:20amకి చేరుకొని, రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను 10:25కి పరామర్శిస్తారు. అనంతరం 10:55కి గాలివీడు చేరుకుని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శిస్తారు. 2:30కి రాయచోటి చేరుకుని లంచ్ చేస్తారు. 4pmకి తిరిగి గన్నవరం వెళ్తారు.
News December 28, 2024
నేడు కడపకు రానున్న పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కడపకు రానున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శిస్తారు. మరోవైపు ఈ దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News December 27, 2024
ఇడుపులపాయలో వింతాకృతిలో పుట్టగొడుగు
వేంపల్లి మండలం ఇడుపులపాయ గ్రామ సమీపంలోని కొండ్రుతు వంకలో శుక్రవారం మనిషి కాలి ఆకృతిలో పుట్టగొడుగు దర్శనమిచ్చింది. ఈ పుట్టగొడుగును చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపుతున్నారు. నెలరోజుల క్రితం ఇదే ప్రాంతంలో మనిషి చేతివేళ్ల ఆకారంలో పుట్టగొడుగు బయటపడిన విషయం తెలిసిందే. ఈ విషయమై హెచ్ఓ రెడ్డయ్యను వివరణ కోరగా.. జన్యు లోపంతో ఇలాంటి పుట్టగొడుగులు పుట్టుకొస్తాయన్నారు.