News October 18, 2024

కడప: అతని కోసం డ్రోన్‌తో వెతుకులాట

image

కడప జిల్లా బద్వేలు పరిధిలోని అట్లూరు మండలానికి చెందిన మోకల కాపరి గంగిరెడ్డి గత 4 రోజులుగా కనిపించడంలేదు. దీంతో చివరికి డ్రోన్‌లను రంగంలోకి దించి అతని జాడకోసం వెతుకుతున్నారు. మరో వైపు గ్రామస్థులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేదు. కాగా గొర్రెల కాపరి గంగిరెడ్డి 4 రోజుల క్రితం అడవికి మేకలను తోలుకుని వెళ్లాడు. అప్పటినుంచి ఇంటికి రాకపోవడంతో గ్రామస్థుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News

News January 3, 2025

ప్రొద్దుటూరు: 184 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

image

రూరల్ పరిధిలోని ఆటోనగర్లో అక్రమంగా నిలువ ఉంచిన 184 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. రూరల్ పోలీసులు అందించిన సమాచారం మేరకు ఒక రూమ్‌లో దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వో గంగయ్య, డీటీ మల్లికార్జున, ఇతర అధికారుల సమక్షంలో పంచనామా చేసి అక్రమ బియ్యాన్ని సీజ్ చేశారు.

News January 3, 2025

కడప: 150 స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్

image

కడప జిల్లా జోన్-4 పరిధిలో 150 స్టాఫ్ నర్సు పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రీజనల్ డైరెక్టర్ రామగిడ్డయ్య ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తి చేసి కడప పాత రిమ్స్‌లోని ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు https://cfw.ap.nic.in/ వెబ్‌సైటును సంప్రదించాలన్నారు.

News January 3, 2025

కడప పట్టణ పాలకుడైన ఆలయం మీరు చూశారా?

image

కడప పట్టణం పాత కడప సచివాలయం వార్డు -1 నుంచి 1.5 కి.మీ దూరంలోని శ్రీ కాలభైరవపురంలో (ప్రస్తుతవాటర్ గండి కొండ వద్ద) చోళ రాజులు నిర్మించిన కాలభైరవ స్వామి ఆలయం ఉంది. 8వ శతాబ్దానికి చెందిన తెలుగు శిలా శాసనంలో సమరాధిత్య, విమలాదిత్య అనే బిరుదులు అందులో తొలి తెలుగు శిలా శాసనాలు అయిన కల్లమల, ఎర్రగుడిపాడు శాసనాలు మన జిల్లాలో లభించినవి. కడపలో లభించిన తొలి ప్రాచీన తెలుగు శిలాశాసనం.