News July 13, 2024

కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం

image

కడప జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం నియమించింది. కడప ఎస్పీగా పనిచేస్తున్న సిద్ధార్థ కౌశల్‌ను బదిలీ చేసింది. ఎన్నికల అనంతరం ఉన్నత అధికారులను బదిలీ ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా కలెక్టర్‌ను మార్పు చేసిన విషయం తెలిసిందే. ఎస్పీగా నియమించబడ్డ హర్షవర్ధన్ రాజు గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేశారు.

Similar News

News December 30, 2024

కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ సస్పెండ్

image

కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గురునాథ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్‌గా వున్న గురునాథ్‌ ఎస్ఐ అని చెప్పుకొంటూ ప్రజలను బెదిరించడం, సక్రమంగా విధులు నిర్వర్తించకుండా ఉండటంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వారు అందించిన నివేదిక ప్రకారం అతనిపై ఎస్పీ వేటు వేశారు

News December 30, 2024

కొత్త సీఎస్‌ది కడప జిల్లానే!

image

రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా నియమితులైన కె.విజయానంద్ మన జిల్లాకు చెందిన వారే. కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. 1965లో జన్మించారు. అనంతపురం జేఎన్‌టీయూ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్ జనవరి 1వ తేదీన సీఎస్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు.

News December 30, 2024

అన్నమయ్య జిల్లా: ప్రమాదంలో భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

image

మదనపల్లె బైపాస్‌లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు టైర్ పంచర్ కావడంతో బైకు, బంకు, చెట్టును ఢీకొట్టింది. గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.