News May 6, 2024

కడప: ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయి?

image

ఎన్నికలు తుది అంఖానికి చేరుకున్నాయి. మరో 7 రోజుల్లో పోలీంగ్ మొదలవుతుంది. దీంతో నాయకులు పథకాలు, హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో YCP పూర్తి పెత్తనం సాగింది. 2014 ఎన్నికలలో 9 స్థానాలు గెలవగా, 2019 ఎన్నికల్లో 10 స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి ప్రధాన పార్టీలైన YCP, TDP కూటమి, కాంగ్రెస్ కడప జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు?

Similar News

News September 30, 2024

కడప: స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

కడప జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో మిషన్ శక్తి పథకం ద్వారా నిర్వహిస్తున్న వన్ స్టాప్ సెంటర్, న్యూ రిమ్స్ కడప నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. దరఖాస్తు ఫారంలను https://kadapa.ap.gov.in వెబ్ సైట్ నుంచి పొందగలరన్నారు. అర్హతల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు అర్హులైన వారు అక్టోబర్ 10 సాయంత్రం 5 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 30, 2024

కడప జిల్లా గృహ నిర్మాణా శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా రాజారత్నం

image

కడప జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా రాజరత్నం సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ సంస్థ ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గృహ నిర్మాణాల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్మాణ పనులు వేగవంతం చేసి లక్ష్యాలను సాధిస్తామని తెలిపారు.

News September 30, 2024

కడప జిల్లాలో ప్రొహిబిషన్ &ఎక్సైజ్ SIల బదిలీలు

image

రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ SIల బదిలీలను చేపట్టింది. కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల ఎక్సైజ్ SIల వివరాలు ఇలా ఉన్నాయి.
కడప- బి కృష్ణకుమార్
సిద్ధవటం- శ్రీ రాజశేఖర్
ఎర్రగుంట్ల- ఏ గోపికృష్ణ
జమ్మలమడుగు- సరితారెడ్డి
ప్రొద్దుటూరు- సివి సురేంద్రారెడ్డి
పులివెందుల- చెన్నారెడ్డి
ముద్దనూరు- విన్నీ లత
మైదుకూరు- ధీరజ్ రెడ్డి
బద్వేల్- సీతారామిరెడ్డి