News March 29, 2024
కడప కూటమి ఎంపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711701579296-normal-WIFI.webp)
తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీ కూటమి కడప పార్లమెంట్ అభ్యర్థిగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన భూపేశ్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కాసేపటి క్రితం జాబితాను విడుదల చేసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఆశించగా కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించడంతో భూపేశ్కు కడప ఎంపీ స్థానాన్ని ఇచ్చారు. భూపేశ్ విజయానికి కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల కార్యకర్తలు పని చేయాలని సూచించారు.
Similar News
News February 5, 2025
సింహాద్రిపురంలో పులి పిల్లలు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738732961569_1271-normal-WIFI.webp)
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలో కలకలం రేగింది. మంగళవారం గ్రామంలో పులి పిల్లలు కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. రెండు పులి పిల్లలు నెమళ్లను వేటాడుతూ కనిపించాయని గ్రామస్థుడు కిషోర్ అన్నారు. మరికొందరు కూడా పొదల్లో పులి పిల్లలు కనిపించాయని తెలిపారు. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
News February 5, 2025
కడపలో మహానాడు స్థలాన్ని పరిశీలించిన మంత్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738677843955_52218543-normal-WIFI.webp)
మే లో కడప వేదికగా నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సవిత జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చైతన్యతో పాటు పలువురు నాయకులతో కలిసి మహానాడు నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ఎంతమంది వస్తారు వారికి తగ్గ ఏర్పాట్ల చేసేలా చూడాలని మంత్రి నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు వస్తారన్నారు.
News February 4, 2025
నేటి విద్యార్థులే రేపటి పౌరులు: మంత్రి సవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738667916894_60318292-normal-WIFI.webp)
నేటి విద్యార్థులే రేపటి భవిభారత పౌరులని, విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత అన్నారు. మంగళవారం స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో 37వ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సవిత ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు.