News November 11, 2024
కడప జిల్లా MLAలు నేడు అసెంబ్లీలో ఏం మాట్లాడతారో.!
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి కడప ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, యువతకు ఉద్యోగ కల్పన, పరిశ్రమలు, గండికోట అభివృద్ధి వంటి అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన MLAలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 14, 2024
కడప: వర్షంలోనూ సజావుగా ఆర్మీ ర్యాలీ
కడపలో ఆర్మీ రిక్యూట్‌మెంట్ ర్యాలీ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కడప జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగవరోజు ర్యాలీ జరుగుతున్న DSA మైదానం బురదగా మారింది. దీంతో రిమ్స్ హాస్పిటల్ రోడ్డులో రన్నింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
News November 14, 2024
ప్యానల్ స్పీకర్ల జాబితాలో కడప జిల్లా MLAలు
వివిధ పార్టీలకు చెందిన MLAలను అసెంబ్లీ ప్యానల్ స్పీకర్‌లుగా నియమించారు. ఈక్రమంలో కడప జిల్లా బద్వేల్ వైసీపీ MLA దాసరి సుధాకు ఆ జాబితాలో చోటు దక్కింది. రెగ్యులర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు.. దాసరి సుధ స్పీకర్ కుర్చీలో కూర్చుని అసెంబ్లీని నడుపుతారు. వైసీపీలో గెలిచిన 11 ఎమ్మెల్యేల్లో ఈమె ఒకరు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిని సైతం ప్యానల్ స్పీకర్‌గా ఎంపిక చేశారు.
News November 14, 2024
పులివెందులలో అవినీతి.. 11 మందిపై విచారణ
పులివెందులలో ఏడేళ్ల క్రితం జరిగిన అవినీతిపై తిరిగి విచారణ మొదలైంది. పులివెందుల ICDS ప్రాజెక్టు పరిధిలో రూ.8.71 లక్షల విలువైన బియ్యం, పప్పులు, ఆయిల్, ఇతర ఆహార పదార్థాలు దుర్వినియోగం చేశారని 2017లో గుర్తించారు. అప్పడు షోకాజ్ నోటీసులు మినహా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో సీడీపీవోగా పనిచేసి రిటైర్డ్ అయిన సావిత్రితో పాటు మరో 10 మంది సూపర్వైజర్లపై విచారణకు తాజాగా ప్రభుత్వం ఆదేశించింది.