News March 28, 2025

కడప జిల్లాలో తగ్గిన అరటికాయల ధరలు.!

image

కడప జిల్లాలో అరటి ధరలు అమాంతంగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టన్ను రూ.6వేల నుంచి రూ.9వేలు పలుకుతున్నాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు అరటి గెలలన్నీ నేలకూలడంతో నష్టపోయిన రైతులను తగ్గిన అరటి ధరలు మరింత కుంగదీస్తున్నాయి. గతంలో టన్ను అరటికాయలు రూ.16 నుంచి రూ.18వేలు పలికాయి. ప్రభుత్వం స్పందించి అరటికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. = రైతులను = అరటికాయలు రూ.16 వేల

Similar News

News April 2, 2025

కడప: వైవీయూ దూర విద్యా పీజీ ఫలితాలు విడుదల

image

వైవీయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యు కేషన్ పీజీ 1, 2 సెమిస్టర్ల ఫలితాలను సీడీవోఈ డైరెక్టర్ ప్రొ. కె. కృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ డా. ఎం. శ్రీధర్ బాబుతో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ,, 1, 2వ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 08 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించామన్నారు. ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను అభినందించారు.

News April 2, 2025

ఒంటిమిట్టలో రైళ్లు నిలపాలి: ఎంపీ మిథున్ రెడ్డి

image

ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్ర‌త్యేక‌ రైళ్లను నిలపాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయ‌ని, భక్తుల కోసం రాయలసీమ, తిరుమల, వెంకటాద్రి, తిరుపతి–గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌ను ఒంటిమిట్టలో నిలపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి రాసిన లేఖ‌లో కోరారు.

News April 2, 2025

పోరుమామిళ్ల: యువతి ఆత్మహత్య

image

పెళ్లి కావడంలేదని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోరుమామిళ్ల మండలంలో జరిగింది. పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరువెంగలాపురంలో రామ తులసి(25) అనే యువతి పెళ్లి కావడంలేదని మనస్థాపంతో మంగళవారం ఉరేసుకుంది. మృతదేహాన్ని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!