News April 24, 2025

కడప: తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – కలెక్టర్

image

తాగునీటి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం ప్రొద్దుటూరు నియోజకవర్గ అబివృద్ధి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పశువులకు నీటి సరఫరా కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, జమ్మలమడుగు అర్డీఓ సాయిశ్రీ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 24, 2025

కడప: నోటిఫికేషన్ విడుదల

image

ఏపీలో నిన్న టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని 4 IIITల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 24, 2025

ఉమ్మడి కడప: ఒకేసారి తండ్రి, కూతురు పాస్

image

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన 2025 పది పరీక్షా ఫలితాల్లో తండ్రి, కూతురు ఒకేసారి ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం ఆవుల శెట్టివారిపల్లెకు చెందిన మోడెం వెంకటేశ్ 268 మార్కులు తెచ్చుకున్నారు. ఈయన 9వ తరగతి వరకు చదివి డ్రాప్ అయ్యారు. ఈ ఏడాది ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి పాస్ అయ్యారు. ఆయన కుమార్తె మోడెం పూజిత ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివి 585 మార్కులు సాధించింది.

News April 24, 2025

ప్రొద్దుటూరులో చదువుకున్న అమ్మాయికి స్టేట్ థర్డ్

image

టెన్త్ ఫలితాలలో జె.శ్రీవాణి సత్తా చాటింది. రైల్వే కోడూరు మంగంపేటలో నివాసం ఉంటున్న జె. శ్రీవాణి 598 మార్కులతో స్టేట్ 3వ ర్యాంక్, జిల్లా ఫస్ట్ ర్యాంకులు సాధించింది. ప్రొద్దుటూరు YMR కాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివి ఈ ఘనత సాధించింది. ఈమె తల్లిదండ్రులు జానకిరామారెడ్డి, లక్ష్మీదేవి, చిరు వ్యాపారస్తులుగా మంగంపేటలో జీవనం కొనసాగిస్తున్నారు.

error: Content is protected !!